సాక్షిప్రతినిధి, వరంగల్ : కాజీపేట నుంచి కాచిగూడ వైపు వెళ్లే పలు సుదూర ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ శాశ్వతంగా కొత్త మార్గాన్ని అమలు చేసింది. ఇప్పటి వరకు ఈ రైళ్లు మౌలాలి గేట్ క్యాబిన్ – మల్కాజిగిరి – కాచిగూడ మార్గంలో చుట్టూ తిరుగుతూ ప్రయాణించేవి. తాజాగా నిర్మించిన లాలాగూడ – సీతాఫల్ మండి 4 కిలోమీటర్ల కార్డ్ (బైపాస్) రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈ రైళ్లను ఇకపై ఈ కొత్త మార్గంలో నడపాలని నిర్ణయించారు. ఈ కొత్త బైపాస్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఇటీవల అన్ని సాంకేతిక పరీక్షలు, భద్రతా పరిశీలనలు పూర్తవడంతో రైల్వే శాఖ ఈ లైన్‌ను వినియోగంలోకి తీసుకొ చ్చింది. దీంతో రైళ్లు మల్కాజిగిరి వైపు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా సీతాఫల్‌మండి మీదుగా కాచిగూడ చేరుకునే అవకాశం ఏర్పడింది.
సమయం ఆదా.. భవిష్యత్‌లో టైం టేబుల్‌లో మార్పులు
ప్రస్తుతం కొత్త మార్గంలో నడిపిస్తున్న రైళ్ల షెడ్యూల్‌లో ఎలాంటి సమయ మార్పులు చేయలేదు. అయితే ప్రయాణ దూరం, సమయం తగ్గనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ రైళ్ల టైం టేబుల్‌ను పునఃసమీక్షించి ప్రయాణ సమయాన్ని తగ్గించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
కాచిగూడ రూట్‌కు కొత్త బైపాస్
లాలాగూడ–సీతాఫల్‌మండి 4 కి.మీ. కార్డ్ లైన్‌పై శాశ్వతంగా రైళ్ల దారి మళ్లింపు
ప్రయాణ సమయం ఆదాకు మార్గం
భవిష్యత్‌లో టైం టేబుల్‌లోనూ
మార్పులకు అవకాశం
దారి మళ్లించిన రైళ్లు
12707/12708 తిరుపతి–హజ్రత్
నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ట్రై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12649/12650 యశ్వంత్‌పూర్–హజ్రత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12647/12648 కోయంబత్తూరు–హజ్రత్ నిజాముద్దీన్ కొంగు వీక్లీ సూపర్‌ఫాస్ట్
ఎక్స్‌ప్రెస్
12975/12976 జైపూర్–మైసూరు బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12193/12194 జబల్‌పూర్–యశ్వంత్‌పూర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
15023/15024 గోరఖ్‌పూర్–యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (అయోధ్య మార్గం)
12251/12252 కోర్బా–యశ్వంత్‌పూర్
వెన్‌గంగా బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
11085/11086 గ్వాలియర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్


