ఎన్నికలకు ముందే
● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న
హన్మకొండ: ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ముందే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ స్థాయి నిర్మాణ మహా సభ నిర్వహించారు. ఈ మహాసభలో వెంకన్న పాల్గొని మాట్లాడుతూ యూనియన్ నాయకత్వంలోని జేఏసీ ద్వా రా పోరాడి హామీలు సాధించుకున్నామన్నారు. వి లీన ప్రక్రియ కూడా పూర్తి చేయించే బాధ్యత తమదేనని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఎంప్లాయీస్ యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల ప్రతీ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. ఆర్టీసీని త్వరలో ప్రభుత్వంలో విలీన ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రీజియ న్ చైర్మన్‌గా ఎస్.ఆర్.కుమార్, అధ్యక్షుడిగా ఎ.మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ.రమేశ్, కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నాయకులు వి.కె. స్వామి, బాలరాజు, ఎల్లయ్య, మురళి, వి.సి .కుమార్, పి.రవీందర్, టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


