కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, అలాగే మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్ లాగ్ విద్యార్థులకు బీఏ, బీకాం, బీఎస్సీ, ఒకేషనల్ బీఏ(ఎల్) బీసీఏ, బీహెచ్‌ఎం సిటీ, పీడీసీ (ప్రిడిగ్రీకోర్సు) ఫస్టియర్, సెకండియర్ కోర్సుల పరీక్షలకు ఫీజు నోటిఫికేషన్ జారీచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, పి. వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుములేకుండా ఏప్రిల్ 4వతేదీ వరకు ఫీజు చెల్లించాలన్నారు. రూ. 50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వతేదీ వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు.


