ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Mar 17 2026 8:53 AM | Updated on Mar 17 2026 8:53 AM

కాళోజీ సెంటర్‌: కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీఎస్‌యూ టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌ డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి రెండో దశ నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కాళోజీ విగ్రహం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్‌, ప్రధాన కార్యదర్శి సి.సుజన్‌ ప్రసాద రావు, కోశాధికారి ఎస్‌ఎ రవుఫ్‌, కార్యదర్శిలు పాక శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

‘వేం’ను కలిసిన పవర్‌

ఎంప్లాయిస్‌ జేఏసీ నేతలు

హన్మకొండ : ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర నాయకులు కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న సందర్భంగా వేం నరేందర్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో జేఏసీ చైర్మన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌, సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌, కో కన్వీనర్‌ తాజుద్దీన్‌, తెలంగాణ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సదానందం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు.

అమెరికాలో గుండెపోటుతో వరంగల్‌ వాసి మృతి

రామన్నపేట : వరంగల్‌ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్‌(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్‌ 2007 సంవత్సరంలో ఎంఎస్‌ చదివేందుకు యూఎస్‌ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్‌ గుండెపోటుతో మృతి చెందాడు.

పరామర్శించిన ప్రముఖులు

బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, రాజేశ్వర్‌రావు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వ దేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తె లిపారు. రాకేశ్‌ మృతదేహం భారత్‌కు రావడా నికి ఐదు రోజులు పడుతుందని తెలిపారు.

కుక్కల దాడిలో

బాలికకు గాయాలు

కేసముద్రం: కుక్కల దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధి అమీనాపురం శివారు హనుమంతరావు కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన జాటోత్‌ రజిత మనుమరాలు చిన్ను (ఐదేళ్ల వయసు) ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దా డి చేసి మెడ, వీపు భాగాల్లో కరిచాయి. స్థానికులు కుక్కలను తరిమేశారు. అనంతరం చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి

తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement