భార్య, మామను హత్య చేసి పెట్రోల్‌తో తగలబెట్టిన అల్లుడు | Wife and Father-in-law Shocking Incident In Hanamkonda | Sakshi
Sakshi News home page

భార్య, మామను హత్య చేసి పెట్రోల్‌తో తగలబెట్టిన అల్లుడు

Mar 18 2026 11:03 AM | Updated on Mar 18 2026 12:02 PM

Wife and Father-in-law Shocking Incident In Hanamkonda

హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో ఒక వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

నిందితుడు ప్రవీణ్‌కు, అతని భార్య రాజశ్రీకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. చిన్నపాటి మనస్పర్థలు కాస్తా ముదిరి పెద్ద గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్, తన భార్య రాజశ్రీతో పాటు మామ రాజశేఖర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత, పక్కా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించాడు.

ఈ ఘటనలో ఇద్దరూ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారినట్లు సమాచారం.అనంతరం నిందితుడు తన కుమారుడు, కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement