వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు నాలుగు రోజులు సెలువు ఉందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ (గురువారం)ఉగాది పండుగ సందర్భంగా సెలవు ఉందని, ఈ సమయంలో మా ర్కెట్‌లో క్రయ, విక్రయాలు జరగవన్నారు. 20న(శుక్రవారం)మార్కెట్‌లో యథావిధిగా క్రయ, విక్రయాలు జరుగుతాయని, 21న(శనివారం) రంజాన్ పండుగ (ప్రభుత్వ సెలువు), 22న(ఆదివారం) వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంటున్నారు. ఈ సమయంలో మార్కెట్‌లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. ఈవిషయాన్ని పరి గణనలోకి తీసుకుని రైతులు, వ్యాపారులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని తెలిపారు. 23వ తేదీన (సోమవారం) మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు.


