నేడు హౌసింగ్ బోర్డుఫ్లాట్లకు లాటరీ
వరంగల్ చౌరస్తా: వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రాంకీ ఎన్‌క్లేవ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్ బోర్డు నిర్మించిన ఎల్‌ఐజీ ఫ్ల్లాట్లకు గురువారం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు పీఆర్‌ఓ వి.శ్రీను తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన బ్లాక్–ఏ, బ్లాక్–బి, బ్లాక్–సీలో మొత్తం 102 ఫ్లాట్లు ఉండగా.. నిర్ణీత గడువులోగా మొత్తం 387 దరఖాస్తులు నమోదైనట్లు పేర్కొన్నారు. గురువారం 8న ఆవరణలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్‌లో లాటరీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి
వరంగల్: జూడో క్రీడ.. శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందని వరంగల్ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అన్నారు. జూడో ఆత్మరక్షణ క్రీడగా బాలబాలికలకు ఎంతో ఉపయోగకరమని, క్రీడలతో పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగావకాశాల్లోనూ క్రీడాకారులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. వరంగల్ ఓసిటీలోని మినీ స్టేడియంలో అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రస్థాయి జూడో పోటీల ఎంపికలు బుధవారం ముగిశాయి. అనంతరం ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన వరంగల్ జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ జిల్లా జట్టుకు ట్రోఫీలను రవీందర్‌రెడ్డి అందజేశారు. కార్యదర్శి ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి, జూడో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కై లాశ్‌యాదవ్, జిల్లా క్రీడా మండలి అధికారి అనిల్‌కుమార్, డాక్టర్ కోట సతీశ్, డాక్టర్ గోిపీ, రామయ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.


