వారసత్వ సంపద దేశానికి గర్వకారణం
● హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్
హన్మకొండ క ల్చరల్ : వారసత్వ స ంపదలు దేశానికి గర్వకారణ మని, ప్రతి భారతీయుడు దేశ సంస్కృతి, చరిత్రను తెలుసుకుని కాపాడుకోవాలని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని మంత్రి రోహిత్ ఠాకూర్ దంపతులు సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అర్చకులు ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆలయ స్తంభాల్లో చెక్కిన శిల్పకళను, సూదిపట్టే రంధ్రాలను, తలకిందుల చాప, మనిషి, కల్యాణ మండపం పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కార్యక్రమాలను పరిశీలించేందుకు ఐఏఎస్‌లతో కలిసి ఇక్కడికి వచ్చానని తెలిపారు. దేవాలయాన్ని సందర్శించిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను వారి చదువు, బోధనా పద్ధతులు, ఫలితాలు తదితర ఆంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఫొటో తీయించుకున్నారు. ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది మధుకర్, అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ పాల్గొన్నారు.


