‘లెట్స్ ఎన్రిచ్ ఇంగ్ల్లిష్’కు ప్రాధాన్యమివ్వాలి
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థి ‘లెట్స్ ఎన్రిచ్ ఇంగ్ల్లిష్’ కార్యక్రమం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించుకుని భవిష్యత్‌కు బలమైన పునాది వేసుకునేలా అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మధ్యాహ్న భోజన పథకం అమలు, కిచెన్ గార్డెన్లు–షెడ్లు, టాయిలెట్ల నిర్వహణ, పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, అభ్యాస దీపికలు, లెట్స్ ఎన్రిచ్ ఇంగ్లిష్, స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ‘లెట్స్ ఎన్రిచ్ ఇంగ్లిష్’ ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిలు గణనీయంగా మెరుగుపడుతున్న అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ విని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు 15 రోజుల ఖర్చులు తాను భరిస్తానని కలెక్టర్ తెలిపారు. డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఏఎంఓ మన్మోహన్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, జీసీడీఓ సునీత, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్.ప్రవీణ్‌కుమార్, లెట్స్ ఎన్రిచ్ ఇంగ్లిష్ డీఆర్పీలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్


