వనదేవతల ఆర్చ్‌లకు ఐరన్ గేట్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మల సాలహారం చుట్టూ ఆర్చ్ ద్వారాలకు ఐరన్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్చ్ స్తంభాలపై పీటీ బీమ్‌లను ఏర్పాటు చేసిన అనంతరం గేట్లు బిగిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే నేపథ్యంలో భక్తుల రద్దీ నియంత్రణ, దర్శనాలు సాఫీగా జరిగేలా ఐరన్ గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గద్దెల ప్రాంగణంలో క్యూలైన్..
వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం స్టీల్ క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూం దారిలోని క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూలో రానున్నారు. క్యూలోకి ప్రవేశించే ముందు ఎంట్రెన్స్‌లో కొబ్బరి కాయలు కొట్టేందుకు స్టాండ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. క్యూలో వచ్చిన భక్తులు గద్దెల లోపలకి వెళ్లి అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకోనున్నారు.
వనదేవతల ఆర్చ్‌లకు ఐరన్ గేట్లు


