
కాజీపేట: విధి నిర్వహణలో నిత్యం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలం భీమారంలోని శుభం కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరానికి హాజరైన వైద్యులు ఈసీజీ, 2డీ ఇకో, బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మానసిక వైద్యులు జగదీశ్వర్‌రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ, అదనపు డీసీపీ సంజీవ్, ఏసీపీలు డేవిడ్‌రాజ్, రమేశ్‌కుమార్, నాగయ్య, జితేందర్, కిరణ్‌కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‌గౌడ్, డా.శేషుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
13న కాళోజీ
సోదరుల యాదిసభ
విద్యారణ్యపురి: కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న కాళోజీ సోదరుల యాది సభను నిర్వహించనున్నట్లు కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్ విద్యార్థి శనివారం తెలిపారు. హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ హాల్‌లో నిర్వహించే ఈసభలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజితకు, షాద్ కాళోజీ రామేశ్వర్‌రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ ఉర్దూకవి మసూద్ మిల్లా మహాషర్‌కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో వక్తలుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, ప్రముఖ కవి, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి, ప్రముఖ కవి డాక్టర్ ఎన్‌వీఎన్‌చారి, కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్, బాధ్యులు పందిళ్ల అశోక్‌కుమార్, పాల్గననున్నట్లు పేర్కొన్నారు. స్మారక పురస్కారాల గ్రహీతల పరిచయాన్ని డాక్టర్ కె.రామలక్ష్మి, ఎండీ సిరాజుద్దీన్ చేస్తారని తెలిపారు.
14 నుంచి కార్తీక
మాసోత్సవాలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఈనెల 14న మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. శనివారం ఉదయం గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో మాసశివరాత్రిని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరి రుద్రేశ్వరస్వామివార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. 27న కార్తీకపౌర్ణమి సందర్భంగా దేవాలయంలో లక్షదీపోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్, సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన
మాజీ కార్పొరేటర్లు
అదే బాటలో మరికొంత మంది నేతలు
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి బీఆర్‌ఎస్ తాజా, మాజీ కార్పొరేటర్లు, పలువురు కీలక నేతలు శనివారం కొండా దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లో టీపీీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన నివాసంలో నేతలందరికీ కండువాలు కప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్‌రాజు, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, బత్తిని వసుంధర, తత్తరి లక్ష్మణ్, బాసాని శీను, యువ నాయకుడు బిల్ల పవన్, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, వైస్ చైర్మన్ సదానందం, జన్ను ప్రసన్న, గోరంటల రాజు, కొక్కుల సతీశ్, తోట వేణు, రామకృష్ణ, శ్రీధర్‌గౌడ్, మబ్బు ప్రవీణ్‌తో పాటు మరో 30 మంది కాంగ్రెస్‌లో చేరారు.
