బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి
న్యూశాయంపేట: లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం బ్యాంకర్లతో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ మీటింగ్ (డీసీసీ సమావేశం)లో ఆయన మాట్లాడారు. బ్యాంకులు సామాజిక బాధ్యతగా అర్హులకు రుణాలివ్వాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను బ్యాంకర్లు విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,274 కోట్లు లక్ష్యంగా ఎంచుకోగా.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 7,169 కోట్ల రుణాలు ఇచ్చి 77.30 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం హవేలీ రాజు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, యూనియన్ బ్యాంకు ఆర్‌హెచ్ కమలాకర్, ఆర్‌బీఐ ఏజీఎం రహమాన్, నాబార్డ్ ఏజీఎం రవి ఉన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్
ఖిలా వరంగల్: మహిళలు వ్యాపారరంగాల్లో ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ సూచించారు. మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులకు నైపుణ్యత, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం(ఎం–సువిధ)పై వరంగల్ శంభునిపేటలోని ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. నాబార్డ్ వరంగల్ అభివృద్ధి మేనేజర్ శ్రీ చైతన్య రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీజీఎం బొల్లా శ్రీనివాస్, ఏజీఎం చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, కార్పొరేటర్ పోశాల పద్మ, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ
కాజీపేట అర్బన్: గ్రామీణ స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు పాడి రైతులకు నగదు లావాదేవీలను సులభతరం చేయడానికి మైక్రో ఏటీఎంలు ఉపయోగపడతాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ కార్యాలయంలో బుధవారం డీసీసీబీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాబార్డ్ సీజీఎం ఉదయ్‌భాస్కర్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జీఎం ఉష శ్రీ, డీజీఎం అశోక్ ఉన్నారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్
డాక్టర్ బండా ప్రకాశ్


