‘పది’పై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రణాళికతో ముందుకెళ్లేలా పర్యవేక్షించాలని డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ ఎంఈఓలను ఆదేశించారు. బుధవారం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో 5వ తరగతినుంచి 10వ తరగతివరకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం అర్హులైన విద్యార్థులతో ఇ–పాస్ ద్వారా దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, సాంఘిక సంక్షేమ జిల్లా సహాయగణాంక అధికారి జి.రాహుల్, ఎంఈఓలు జి.నెహ్రూనాయక్, బి.మనోజ్‌కుమార్, ఎ.శ్రీనివాస్, ఎస్.విజయ్‌కుమార్, ఎం.చంద్రమౌళి, పి.ఆనందం, ఎల్. రాజేశ్‌కుమార్, కె.శ్రీధర్, భిక్షపతి పాల్గొన్నారు.
డీఈఓ గిరిరాజ్‌గౌడ్
ఎంఈఓలతో సమీక్ష


