క్లెయిమ్ చేయని ఆస్తులు పొందొచ్చు
హన్మకొండ అర్బన్: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను హక్కుదారులు తమ బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందొచ్చని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు–మీ హక్కు’ అంశంపై బుధవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గణేశ్ మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు, తది తర ఆస్తులు తిరిగి పొందొచ్చని సూచించారు. ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ షేక్ అ బ్దుల్ రహీం, ఆర్‌బీఐ ఏజీఎం ఎం.జెడ్. రెహమాన్, ఎస్‌బీఐ ఎస్‌ఎల్‌బీసీ మేనేజర్ కాళీప్రకాశ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్ పాల్గొన్నారు.
హక్కులపై అవగాహన కల్పించాలి..
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. వినియోగదారులు ఎక్కువగా తూకాలతో నష్టపోతున్నారని, దీని నివారణకు తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల ఫోరం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఎస్‌ఓ వాజీద్ అలీ, తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్ సింగ్ ఠాగూర్, కార్యదర్శి సూరజ్, ఓరుగల్లు వినియోగదారుల ఫోరం సభ్యులు దండు యుగేందర్, బండ వివేకానంద, శోభ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్
వైవీ గణేశ్
‘మీ డబ్బు – మీ హక్కు’
అంశంపై శిబిరం


