రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ ఏర్పాటు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్‌లో దివంగత బండారి చంద్రశేఖర్, దివంగత బండారి రమణిరత్నం పేర గోల్డ్‌మెడల్, స్వాతంత్య్ర సమర యోధులు, జనధర్మ, వరంగల్‌వాణి పత్రికల వ్యవస్థాపకులు దివంగత ఎంఎస్ ఆచార్య, దివంగత రంగనాయకమ్మ స్మారకార్థం జర్నలిజం విభాగంలో మరో గోల్డ్‌మెడల్ ఏర్పాటు చేశారు. గోల్డ్‌మెడల్‌కింద ఆయా విభాగాల్లో రూ.3లక్షల చొప్పున జమ చేశారు. అధిక మార్కులు పొందిన విద్యార్థికి ఆ నగదు (గోల్డ్‌మెడల్) అందజేయనున్నారు. ఆయా ఉత్తర్వులను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి బుధవారం జారీ చేశారు. విభాగాల అధిపతులు డాక్టర్ బి.రాధికారాణి, ఎం.రాజగోపాలచారి బి.వెంకట్రామ్‌రెడ్డి, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రోబయాలజీలో రెండు, కంప్యూటర్ సైన్స్‌లో రెండు, తెలుగు సబ్జెక్టులో ఒక వేకన్సీ ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల27 సాయంత్రం వరకు కేడీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీతోపాటు పీహెచ్‌డీ, నెట్ లేదా సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మౌఖిక పరీక్షలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగతా వివరాలకు పీజీ కోర్సుల కో–ఆర్డినేటర్ డాక్టర్ వాసం శ్రీనివాస్ 98850 59533లో సంప్రదించాలని ఆయన కోరారు.
శిల్ప కళా సౌందర్యం అద్భుతం
ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాలు, ఆనాటి నిర్మాణ శైలి, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మధ్యకోటను జడ్జి నసీమా తన కుటుంబంతో కలిసి సందర్శించారు. శిల్పాల ప్రాంగణంలోని శిల్ప కళా సంపదను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్.. జడ్జి కుటుంబానికి వివరించారు. జడ్జి వెంట ఎస్సై శ్రావణ, టీజీ టీడీసీ కోట ఇన్‌చార్జ్ అజయ్, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది ఉన్నారు.
కేయూ క్యాంపస్: చైన్నెలోని అమీట్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పురుషుల టోర్నమెంటుకు కేయూ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో కె.శ్రీసాయివర్ధన్, ఎన్.యశ్వంత్ రెడ్డి, బి.చింతేశ్వర్‌రెడ్డి, ఎస్.ప్రేమ్‌దినకర్, కె.దీపక్‌బాబు ఉన్నట్లు పేర్కొన్నారు. నరేశ్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహస్తారని తెలిపారు.
టెన్నిస్ మెన్, ఉమెన్ జట్ల ఎంపిక..
బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28 వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ మెన్ అండ్ ఉమెన్ జట్లను ఎంపిక చేసినట్లు వెంకయ్య తెలిపారు. టెన్నిస్ పురుషుల జట్టులో బి.మనోజ్‌కుమార్, కె.విశాల్ ఆదిత్య, ఎన్.గౌతమ్, ఎం.రామకృష్ణ, కె.శ్రావణ్ ఉన్నారు. ఉమెన్స్ జట్టులో డి.ప్రదీప్త, టి.సింధు, హెచ్.సంయుక్త, డి.అఖిల ఉన్నారు. ఎస్.మహేశ్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరించనున్నారు.


