తడి, పొడి చెత్తను వేరు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: డీఆర్‌సీసీ నిర్వాహకులు పొడి చెత్తను స్వీకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శానిటేషన్ తనిఖీల్లో భాగంగా కమిషనర్ బుధవారం హనుమకొండ పరిధి 57, 59 డివిజన్లలో ప్రత్యక్షంగా శానిటేషన్ తీరును పరిశీలించారు. స్వచ్ఛ ఆటోలన్నీ భవానీనగర్ వాట ర్ ట్యాంక్ వద్దకు తీసుకొచ్చి తడి, పొడి చెత్తను వేరు చేయాలని, ప్రతీ గృహం నుంచి సేకరించాలని కోరారు. డీఆర్‌సీసీ కేంద్రం ఇక్కడే ఉన్నందున పొడి చెత్తను డీఆర్‌సీసీ నిర్వాహకులు స్వీకరించాలని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్రమ్ శ్రీను, ఆస్కి ప్రతినిధి రాజ్‌మోహన్, వావ్ ప్రతినిధి పవన్ పాల్గొన్నారు.


