మరో యువతితో భర్త చనువు.. పెళ్లైన 6 నెలలకే గర్భిణి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

నువ్వు చస్తే.. ఆమెను పెళ్లి చేసుకుంటా..

Sep 2 2023 1:10 AM | Updated on Sep 2 2023 10:03 AM

- - Sakshi

వారికి పెళ్లయి ఆరు నెలలైంది. ఆమె రెండు నెలల గర్భిణి. కానీ భర్త.. మరో అమ్మాయితో చనువుగా ఉన్న ఫొటోలను చూసి ఇదేమిటని అడిగితే 

వరంగల్: వారికి పెళ్లయి ఆరు నెలలైంది. ఆమె రెండు నెలల గర్భిణి. కానీ భర్త.. మరో అమ్మాయితో చనువుగా ఉన్న ఫొటోలను చూసి ఇదేమిటని అడిగితే 

‘నీవు చస్తే.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఉరి వేసుకొని చావు’ ..అంటూ ఈసడించుకోవడంతో మనస్తాపానికి గురైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరి కృష్ణ–రేణ దంపతుల కుమార్తె అర్బన అలియాస్‌ హర్షిణి (20)ని పాలకుర్తి మండలం లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన మల్యాల అంజనేయులు కుమారుడు వినేష్‌కు ఈ ఏడాది మార్చి 10న ఇచ్చి వివాహం జరిపారు.

20 రోజుల క్రితం అర్చనను భర్త, తల్లి కలిసి జనగామలోని ఓ అస్పత్రికి తీసుకెల్లి చూపించగా రెండు నెలల గర్బిణిగా వైద్యులు నిర్దారించారు. అక్కడి నుంచి అర్చనను భర్త వినేష్‌ తన ద్విచక్రవాహనంపై పుట్టింటికి తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. గత నెల 31న వినేష్‌ భార్య వద్దకు చేరుకున్నాడు. భర్త సెల్‌ఫోన్‌ను అర్చన పరిశీలిస్తుండగా వినేష్‌ మరో యువతితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను గుర్తించింది. ఆ అమ్మాయి ఎవరు అని నిలదీయగా ‘నీవు చస్తే.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఉరి వేసుకొని చావు’ ..అంటూ కోపంతో భర్త వెళ్లిపోయాడు.

దీంతో అర్చన తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఉదయం భర్త వినేష్‌,.. అర్చనకు ఫోన్‌ చేసి గొడవపడ్డాడు. ఈ విషయం అర్చన తల్లిదండ్రులకు చెప్పి ఏడ్చింది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లాక తీవ్ర మనోవేదనతో ఉన్న అర్చన బాత్‌రూంలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుంది. పక్కింటి వారు గుర్తించి ఉరి నుంచి అర్చనను విడదీయగా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్న కొద్ది సేపటికే మరణించింది. అల్లుడు వినేష్‌ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వినేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చాగర్ల రఘుపతి తెలిపారు.

ఏడాది క్రితం కొడుకును కోల్పోయి..
కృష్ణ–రేణ దంపతులకు కుమారుడు మహేష్‌, కూతురు అర్చన ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం కుమారుడు మహేష్‌ భువనగిరి జిల్లాలో అనుమానాస్పదంగా మరణించాడు. అప్పటికే కూతురు అర్చనకు పెళ్లి ఖాయం కావడంతో వివాహం జరిపించారు. పెళ్లి అయిన ఆరు నెలలకే కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement