కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు | Sakshi
Sakshi News home page

కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు

Published Thu, Jun 29 2023 1:20 AM

-

కేయూ క్యాంపస్‌ : మొక్కలలో జన్యుసవరణలతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆస్ట్రేలియా ముర్దోక్‌ వర్సిటీ సైంటిస్టు ఎంజీకే జోన్స్‌ అన్నారు. కేయూలోని సేనేట్‌హాల్‌లో నిర్వహిస్తున్న ప్లాంట్‌ బయోటెక్నాలజీ ‘జీనమ్‌ ఎడిటింగ్‌‘ పై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో బుధవారం ఆయన ప్రసంగించారు. ‘జీనోమ్‌ ఎడిటింగ్‌’ ద్వారా సృష్టించిన నూతన వంగడాలను, పంటలను ఏఏ దేశాలల్లో ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంతోపాటు వాటి వినియోగం భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా వివరించారు. అనంతరం పూణేలోని సావిత్రి బాయి ఫూలే యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీలమిత్ర .. టమాటా మొక్కల అభివృద్ధిలో వివిధ రకాల ఒత్తిళ్లు, కరువు పరిస్థితులను తట్టుకునేలా ఉండే ప్రయోగాలను వివరించారు, ఓయూ ప్రొఫెసర్‌ కేవీ రావు..

రసం పీల్చే పురుగులు, క్రిమి కీటకాలను తట్టుకునే పత్తి, వరి పంటల గురించి వివరించారు. భారతీయర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సతీశ్‌ కుమార్‌.. ట్రాన్స్‌జీన్‌ టెక్నాలజీ, పరిశోధన గురించి వివరించారు. మలేషియా మలయా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జెన్నిఫర్‌ అన్న హరికష్ణ.. జీవసాంకేతిక జన్యుసవరణల పరిశోధనల ద్వారా నిలబడే అరటి మొక్కలను గురించి వివరించారు. బెంగళూర్‌ టీఎఫ్‌ఆర్‌ ఎన్‌సీబీసీ శాస్త్రవేత్త పీవీ శివప్రసాద్‌.. ఆహార ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలు వివరించారు. సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ప్రకాశ్‌ పి కుమార్‌ మాట్లాడుతూ పంటల అభివృద్ధికి బయో టెక్నాలజీ పరిష్కారమన్నారు.

కార్యక్రమంలో కేయూ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్లు ఎన్‌ రామస్వామి, ఎ సదానందం, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు రోజారాణి, ఎంవీ రాజం, ప్రశాంత మిశ్రా, కోటా శ్రీనివాస్‌, కేవీ సరిత, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు చేరాలు, మాధురి, కేయూ బయోటెక్నాలజీ విభాగం అఽధిప తి వెంకటయ్య, ఏవీ రావు, శాసీ్త్ర పాల్గొన్నారు.కాగా, అతిథులు సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు.

ఆకట్టుకున్న పోస్టర్ల ప్రజెంటేషన్స్‌..
కేయూలో బయోటెక్నాలజీ విభాగం, యూకే అబెర్విసిత్‌ వెల్స్‌ యూనివర్సిటీ కొలబరేషన్‌లో ప్లాంట్‌ బయోటెక్నాలజీ ‘జీనమ్‌ ఎడిటింగ్‌’ అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో పలువురు పరిశోధకులు పోస్టర్లను ప్రజెంటేషన్‌ చేశారు. జీవసాంకేతిక పరిజ్ఞానంతో నూ తన వంగడాలు తదితర అంశాలపై అక్కడికి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులకు తెలిపారు. 25 వరకు పోసర్లు ప్రజెంటేషన్‌ చేయగా అందులో ప్రతిభ ప్రదర్శించిన వారికి ప్రోత్సాహకంగా ఈనెల 29న ముగింపు సభలో బహుమతులు అందజేస్తారు.

నేడు ముగియనున్న కాన్ఫరెన్స్‌
కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగి యనుంది. ఈముగింపు సదస్సుకు తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, కేయూ మాజీ వీసీ విద్యావతి, కేయూ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావు, రాజమండ్రి ఐసీఏఆర్‌, సీటీఆర్‌ఐ డైరెక్టర్‌ శేషుమాధవ్‌, కేయూ సైన్స్‌ డీన్‌ మల్లారెడ్డి, యూజీసీ కోఆర్డినేటర్‌ మల్లికార్జున్‌రెడ్డి, క్యాంపస్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ సురేశ్‌లాల్‌ తదితరులు హాజరవుతారు.

Advertisement
Advertisement