తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లంకె సూర్యం ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో శనివారం చేరాయి. నూతనంగా పార్టీలో చేరిన వారికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావులు స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో రోజురోజుకూ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు.
టీడీపీకి స్టాలిన్ రాజీనామా
44వ డివిజన్‌కు చెందిన వడ్డేశ్వరపు స్టాలిన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్టాలిన్ తెలుగుదేశం అనుబంధ విభాగమైన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, సహా 100 కుటుంబాలు వైఎస్సార్ సీపీలొ చేరిక
మంగళగిరి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాడేపల్లికి చెందిన టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వడ్డేశ్వరపు స్టాలిన్, సీనియర్ నాయకుడు గొల్లపూడి రాజేంద్రప్రసాద్ ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. మండల పరిధి ఆత్మకూరులోని నియోజకవర్గ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి వీరికీ పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. స్టాలిన్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. సమన్వయకర్త వేణుగోపాల సోమిరెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకత్వంపై నమ్మకంతో పలువురు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సెల్ ఉపాధ్యక్షులతోపాటు మరో 30 మంది కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక


