తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో పూర్వవిద్యార్థుల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ వీసీ డాక్టర్ జి.పార్థసారథి వర్మ, స్కిల్ డెవలప్‌మెంట్ డీన్ డాక్టర్ ఎ.శ్రీనాఽథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వర్సిటీలో విద్యనభ్యసించి దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న పూర్వవిద్యార్థులకు అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానించగా 600 నామినేషన్లు అందినట్లు చెప్పారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మందిని పురస్కారాలకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ పూర్వవిద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ శ్రీకావ్య, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.ఐ.పవన్‌కుమార్, స్కిల్ డెవలెప్ మెంట్ డీన్ డాక్టర్ ఎ. శ్రీనాథ్, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కె.ఆర్.ఎస్.ప్రసాద్, సలహాదారు హబీబుల్లా ఖాన్, పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.సి.హెచ్.శ్రీకావ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సోని పాల్గొన్నారు.


