నేడు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేత | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేత

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

నేడు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేత

131 మంది పేద విద్యార్థులకు రూ.6.15 లక్షల ఉపకార వేతనాలు కృష్ణదేవరాయ, రోపా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పంపిణీ రూ.3.10 లక్షలు అందించనున్న తులసి సీడ్స్‌ తులసి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తులసి యోగీష్‌ చంద్ర

కొరిటెపాడు(గుంటూరు): ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కాకూడదనే లక్ష్యంతో కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ పూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలేజ్డ్‌ సంస్థ ముందడుగు వేసిందని, చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాల పంపిణీకి శ్రీకారం చుట్టిందని తులసి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తులసి యోగీష్‌ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ పూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలేజ్డ్‌(గుంటూరు), రోపా(కర్నూలు) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం 131 మంది పేద విద్యార్థులకు రూ.6.15 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఉపకార వేతనాల మొత్తంలో రూ.3.10 లక్షలను తులసి సీడ్స్‌ సంస్థ అందించనుందన్నారు. కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ పూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలేజ్డ్‌ ద్వారా ఈ మొత్తాన్ని అర్హులైన పేద విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ఈ ఆర్థిక సహాయం ఎంతగానో దోహదపడనుందని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే వారి ఆకాంక్షలకు అండగా నిలవడంతోపాటు విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపనుందని వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తులసి గ్రూప్‌ చైర్మన్‌ తులసి రామచంద్ర ప్రభు హాజరుకానున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement