వైద్య పరిశోధన రంగంలో నూతన అధ్యాయం | - | Sakshi
Sakshi News home page

వైద్య పరిశోధన రంగంలో నూతన అధ్యాయం

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

వైద్య పరిశోధన రంగంలో నూతన అధ్యాయం

ఏలూరు ఏఎస్‌ఆర్‌ఏఎం– ఎయిమ్స్‌ మధ్య కీలక ఒప్పందం

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌లో అత్యున్నత స్థాయి వైద్య పరిశోధనలకు కొత్త దిశానిర్దేశం చేస్తూ ఏలూరులోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఏఎస్‌ఆర్‌ఏఎం), ఎయిమ్స్‌ మంగళగిరి మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఎయిమ్స్‌ మంగళగిరి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అహెంతెం శాంతా సింగ్‌ ఏఎస్‌ఆర్‌ఏఎం మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దాసరి వెంకటేష్‌, అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ గోకరాజు గంగరాజు ఈ ఒప్పందం జరిగిందని తెలిపారు. విజయవాడ బందరురోడ్డులోని లెమన్‌ ట్రీ ప్రీమియర్‌లో అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఈ ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య పరిశోధన, వైద్య విద్య రోగుల సంరక్షణ ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే ఈ ఒప్పంద ఉద్దేశమన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన, నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. ఎయిమ్స్‌ నిపుణుల ద్వారా వైద్యులు, అధ్యాపకులకు శిక్షణ మార్గదర్శకత్వం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌, డైరెక్టర్‌ గోకరాజు రతిదేవి, సీఈఓ డాక్టర్‌ కె.హనుమంతరావు, ఏఎస్‌ఆర్‌ఏఎం సెంటర్‌ ఫర్‌ క్లినికల్‌ రీసెర్చ్‌– ఇన్నోవేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వంశీ కె.కొలుకుల, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చేబ్రోలు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement