‘మెడికల్‌’ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘మెడికల్‌’ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

‘మెడికల్‌’ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

లక్ష్మీపురం: రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌ జీ విమర్శించారు. గుంటూరులోని కొత్తపేట మల్లయ్య లింగం భవన్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన పాలకులు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పూనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలనే నిర్ణయం రాష్ట్రంలోని పేద విద్యార్థుల వైద్య విద్యా కలలను సమాధి చేసే కుట్ర అని విమర్శించారు. ప్రజల పన్నులతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియలో నెలకొన్న జాప్యం వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయకుండా, స్పాట్‌ అడ్మిషన్లను ప్రారంభించకుండా విద్యార్థులను అయోమయానికి గురిచేయడం ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్‌ వలి, సుదర్శనం. అమర్నాథ్‌, నగర నాయకులు సాయి గణేష్‌, సతీష్‌, మహేష్‌, సాయి తేజ పాల్గొన్నారు.

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌ జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement