ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Nov 3 2026 1:57 AM | Updated on Nov 3 2026 1:57 AM

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఏఎన్‌యూలో 50 కౌటింగ్‌ హాళ్లలో 468 టేబుళ్లు ఏర్పాటు

నెహ్రూనగర్‌/ఏఎన్‌యూ(పెదకాకాని): గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగనుంది. కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా, అత్యంత సజావుగా పూర్తి చేయడానికి నగర పాలక సంస్థ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్‌, అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఇంజినీరింగ్‌ కాలేజీ నిర్దేశిత బ్లాకుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను, స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. అదేవిధంగా కౌంటింగ్‌ సిబ్బంది జరుగుతున్న శిక్షణలో జిల్లా ఎన్నికల పరిశీలకులు వి.వీర బ్రహ్మయ్యతో కలిసి పాల్గొన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలోని మొత్తం 76 వార్డుల పరిధిలో ఉన్న 596 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను సకాలంలో లెక్కించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇందుకోసం 468 కౌంటింగ్‌ టేబుళ్లను సిద్ధం చేయగా, ఈ బాధ్యతలను నిర్వహించడానికి 1,404 మంది శిక్షణ పొందిన సిబ్బందిని మరియు అధికారులను విధుల్లో నియమించామన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి తరఫున ప్రతినిధులు 3వ తేదీ ఉదయం 6 గంటల సమయానికి స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్దకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ల సీల్స్‌ తెరిచి లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల లోపలికి ఎలాంటి మొబైల్‌ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement