ముగిసిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

పెడన: కృష్ణా జిల్లా పెడన మండలం లంకలకలవగుంట గ్రామంలో దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి నిర్వహించిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 25 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్‌ పోటీలో చినగంజాం, నెల్లూరు జట్లు తలపడగా చినగంజాం జట్టు విజయం సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. విజేతగా నిలిచిన చినగంజాం జట్టుకు రూ.30వేలు, ద్వితీయ బహుమతి నెల్లూరు జట్టుకు రూ.25 వేలు, తృతీయ బహుమతి స్టువర్టుపురం జట్టుకు రూ.20 వేలు, నాలుగో బహుమతి ఏలూరు జిల్లా వేమవరప్పాడు జట్టుకు రూ.15 వేల నగదు బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాల సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ముత్యాల వెంకటస్వామి తెలిపారు. పోటీల నిర్వహణలో లంకల కలవగుంట చెడుగుడు కమిటీ సభ్యులు కాగిత సత్యనారాయణ, కట్టా సూర్యచంద్రరావు, కట్టా రామ్మోహనరావు కీలకంగా వ్యవహరించారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

రొంపిచర్ల: పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రొంపిచర్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన పమ్మి గోవిందరెడ్డి(46) సుబ్బారెడ్డి కాలనీకి దగ్గర ఉన్న తన పొలం వెళుతున్నాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా, అక్కడ సమీపంలో ఉన్న చెట్టు కిందకి వెళ్లాడు. ఆ సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు చెట్టు కింద కూర్చుని ఉన్న గోవిందరెడ్డి మీద పడటంతో సృహ కోల్పోయి పడిపోయాడు. సమీప పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలు అక్కడికి వచ్చి పిడుగు పడిన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

ద్వితీయ, తృతీయ స్థానాల్లో

నెల్లూరు, స్టువర్టుపురం జట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement