ఫిరంగిపురం: మండలంలోని రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో భద్రపర్చిన ఈవీఎంలను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదివారం తనిఖీ చేశారు. గోడౌన్‌లో భద్రపర్చిన ఈవీఎంలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ తాళాలు, రిజిస్టర్లు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం కచ్చితమైన మార్గదర్శకాలు ఇచ్చిందని చెప్పారు. పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జె.ప్రసాదరావు, వివిధ పార్టీల నాయకులు, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లల్లో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లపై ముందస్తు బైండోవర్‌లు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 1,027 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. గత తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని రౌడీషీటర్లకు పోలీస్ అఽధికారులు సూచించారు. ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని చెప్పారు. చెడు స్నేహాలు, అసాంఘిక కార్యకలాపాలు, నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని హితవు పలికారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. మొత్తం 105 మంది పాల్గొన్న ఈ పోటీల్లో త్రోస్, జంప్స్, రన్నింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షేక్ లాల్ వజీర్ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభకనబరచిన వారిని డిసెంబర్ 12, 13 తేదీల్లో ఒంగోలులో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందన్నారు.
టాస్క్‌పోర్స్: ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో ఆప్కాస్ పద్ధతిపై పనిచేస్తున్న బందెల దేవకుమారి నామినేషన్ వేశారు. ఎనిమిదవ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో పాటు ఫారం–7 కింద గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా కేటాయించారు. దీనిపై నగర పాలక సంస్థ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
నగరంపాలెం: వైఎస్సార్ కడప జిల్లా సి.పి.బ్రౌన్ భాష పరిశోధన కేంద్రంలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో ఆదివారం డాక్టర్ హనుమచ్ఛాస్త్రి జయంతి నిర్వహించారు. జానుమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో 15వ గ్రంథాలయ, సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ జరగ్గా, బృందావన్‌గార్డెన్స్ అన్నమయ్య అధ్యాత్మిక గ్రంథాలయ వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణకు గ్రంథాలయ, సాహిత్య సేవా పురస్కారం ప్రదానం చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, ఆచార్య జీఎన్ రెడ్డి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్, జిల్లా న్యాయమూర్తి రామ్‌గోపాల్ పాల్గొన్నారు.


