తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి చిన్నారులపై కుక్కలు దాడి

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పద్మావతి

గుంటూరు మెడికల్‌: జిల్లాలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మక్కెన పద్మావతి ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను తమ దగ్గర ఉన్న లిస్టు ఆధారంగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాని లేదా సామాజిక ఆరోగ్యలకు గాని తరలించాలన్నారు. తుపాను పరిస్థితుల రీత్యా విద్యుత్‌ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యాధికారులు వ్యాక్సిన్‌లను సురక్షితంగా ఉంచడంలో భాగంగా జనరేటర్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తల్లీబిడ్డ వెండర్లు అవసరాన్ని బట్టి గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలించడంలో భాగంగా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ను 72075 95104కు సంప్రదించాలన్నారు.

నెహ్రూనగర్‌: రామిరెడ్డితోట 5వ లైను (8వ డివిజన్‌)లో కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయాలపాలయ్యారు. పొట్ట, చేయి మీద దాడి చేయడంతో చిన్నారులు భయాందోళనలో అరవడంతో వెంటనే స్పందించిన స్థానికులు కుక్కలను తరిమేశారు. గాయాలపాలైన చిన్నారులను జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణపాయం తప్పింది. నగరంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటికి నగరపాలక సంస్థ అడ్డుకట్ట వేయడంలో విఫలం చెందారని దీని వలన అభం శుభం చిన్నారులు కుక్కల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement