మణిపాల్‌లో లైవ్‌ ఆపరేటివ్‌ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

మణిపాల్‌లో లైవ్‌ ఆపరేటివ్‌ వర్క్‌షాప్‌

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్‌ హాస్పిటల్‌లో ఆదివారం టెప్‌(టోటల్లీ ఎక్స్‌ట్రాపెరిటోనియల్‌) లైవ్‌ ఆపరేటివ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. హాస్పిటల్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, బేరియాట్రిక్‌ సర్జరీ, రోబోటిక్‌ సర్జరీ విభాగాల డైరెక్టర్‌ డాక్టర్‌ గణేష్‌ షెనాయ్‌ మార్గదర్శకత్వంలో వర్క్‌షాప్‌ చేపట్టారు. డాక్టర్‌ గణేష్‌ షెనాయ్‌ మాట్లాడుతూ హెర్నియా చికిత్సలో మినిమల్లీ ఇన్వేసిస్‌ సర్జరీ విధానాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. టీఈపీ, ఈటీఈపీ వంటి పద్ధతులు హెర్నియా చిక్సిత అందించడంలో సర్జన్లకు వివిధ మార్గాలను అందిస్తున్నారని వివరించారు. హాస్పిటల్‌ డైరెక్టర్‌ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ హెర్నియా చికిత్సలో ఉపయోగించే ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని రోగుల చికిత్సలో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకునే అవకాశాన్ని సర్జర్లను కల్పించామని తెలిపారు. ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రదర్శనలు, ఆచరణాత్మక శిక్షణ వలన మినిమల్లీ ఇన్వేసివ్‌ విధానాల్లో వివిధ దశలను సర్జన్లు మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ డి.రవి(జనరల్‌ సర్జరీ), డాక్టర్‌ డి.వరుణ్‌(సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ) పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement