నాదెండ్ల: ఇరువురు మిత్రుల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకున్న మూడో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన గణపవరం సినిమాహాల్ సెంటర్‌లో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాదెండ్ల గ్రామానికి చెందిన గోపీకృష్ణ, ధనుష్ మిత్రులు. గోపీకృష్ణ సుబాబుల్ తోట నరికే పనులకు వెళ్తుంటా డు. బుధవారం ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ధనుష్ తరపున చిరుమామిళ్ల గ్రామానికి చెందిన జడ జాన్‌పీటర్ మాట్లాడేందుకు వచ్చాడు. ఈ క్రమంలో గోపీకృష్ణపై పీటర్‌పాల్ చేయిచేసుకున్నాడు. దీంతో గోపీకృష్ణ తన చేతిలోని సుబాబుల్ నరికే కత్తితో పీటర్‌పాల్‌పై దాడి చేశా డు. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బాపట్ల: జిల్లాలోని చీరాల, రేపల్లె మున్సిపాలిటీలకు నవంబర్ ఒకటో తేదీన జరగనున్న పోలింగ్ విధులు నిర్వర్తించే పీఓలకు 2వ విడత శిక్షణ శుక్రవారం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం బోర్డు రూమ్‌లో జిల్లాకు కేటాయించిన సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఏఏఎల్.పద్మావతి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల విధుల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్ సింగ్, జిల్లా కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున, గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డినేటర్ యశ్వంత్, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


