చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

మాజీ ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి గుంటూరు డివిజన్లలో మేయర్‌ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి తరఫున ప్రచారం

నెహ్రూనగర్‌: గుంటూరు నగరంలో వైఎస్సార్‌ సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నగరంలోని పలు వార్డుల్లో పార్టీ నేతలు, అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 4వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో మాజీ ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి స్థానిక మహిళలు హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పనున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా 1, 11వ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి శ్రీదేవి, నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. లాలాపేట ప్రాంతానికి చేరుకుని ఇంటింటికీ తిరిగారు. పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. శ్రీదేవి మాట్లాడుతూ.. తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని తెలిపారు. ఇది తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని, ఈ ఎన్నికల్లో వందకు వంద శాతం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. 16వ డివిజన్‌లో నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తేనే నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నిండింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement