పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఇన్‌న్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్ట్రియాన్ ఇన్నోవేట్ బియాండ్ బౌండరీస్ రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశినేని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. మండల పరిధిలోని నంబూరు వీవీఐటీయూలో నిర్వహించిన సదస్సులో కేశినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు నూతన ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవంలో ప్రో–చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ ఆళ్ల కళావతి, డైరెక్టర్, ప్రొఫెసర్ ఎంవై భానుమూర్తి, టీఎల్‌సీ హెడ్ డాక్టర్ రావెల నవీన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు డాక్టర్ పీఎస్‌ఎన్ కృష్ణప్రసాద్, డాక్టర్ సిహెచ్.నాగసాయి కళ్యాణ్ పాల్గొన్నారు.


