నెట్‌వర్క్‌ రిపేరు పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

నెట్‌వర్క్‌ రిపేరు పేరుతో మోసం

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

తెనాలి: ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పాత బజాజ్‌ షోరూం పక్కన ఉన్న ధూపం రాజేష్‌ అనే వ్యక్తి డ్రై ఫ్రూట్‌ షాప్‌లో లైన్‌ మోసానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ రిపేర్‌ చేయడానికి వచ్చానని చెప్పి పక్కన స్థంభానికి ఉన్న నెట్‌ వర్క్‌ ను రిపేర్‌ చేసినట్టు నటించాడు. తిరిగి షాప్‌లోకి వచ్చి, ‘మీకు నెట్‌ వస్తుందా’ అని అడిగాడు. షాప్‌ యజమాని రావడం లేదు అని చెప్పగా, మీ ఫోన్‌లో సరిచేయాలని చెప్పి, రాజేష్‌ ఫోన్‌ తీసుకుని తన అకౌంట్‌ లో ఉన్న రూ.24 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. తర్వాత తను మోసపోయానని తెలుసుకున్న రాజేష్‌, తన అకౌంట్‌ను నిలిపివేసి బ్యాంక్‌కు వవెళ్లి తెలుసుకోగా, హైదరాబాద్‌లోని చైతన్య గ్రామీణ బ్యాంక్‌లో ఒక మహిళ అకౌంట్‌లోకి వెళ్లినట్టు బ్యాంక్‌ అధికారులు నిర్ధారించారు. ఆ వివరాలు తీసుకుని టూ టౌన్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇవ్వడానికి వెళితే, స్టేషన్‌లో కేసు నమోదు చేసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ‘నాది చిన్న అమౌంట్‌ కావచ్చు కానీ దొంగిలించిన వ్యక్తి ఇంకా ఎన్ని చేసి ఉంటాడో? నా అకౌంట్‌ లో పెద్ద మొత్తంలో అమౌంట్‌ ఉన్నట్టయితే, ఆ మొత్తం పోయి ఉండేది కదా’ అని బాధితుడు వాపోతున్నాడు.

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

శావల్యాపురం: మండలంలోని కృష్ణాపురం గ్రామ సమీపాన గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు మేరకు.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు కారులో అనంతరపురం నుంచి విజయవాడ బయలుదేరారు. నరసరావుపేట నుంచి వినుకొండ వైపు ట్రాలీ వాహనంలో ఇంటిసామానుతో బయలుదేరి వస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి యువకులు ప్రయాణిస్తున్న వాహనం ఇంటి సామగ్రి ఉన్న వాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టింది. ఘటనలో వాహన డ్రైవర్‌ సురేష్‌ కుడి చేతికి, ట్రాలీ వాహనంలో ఉన్న గుండాల వెంకయ్యలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇరువురిని 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు తన సిబ్బంది చేరుకొని రోడ్డుకు అడ్డుగా ఉన్న రెండు వాహనాలను గ్రామస్తులు సహకారంతో ట్రాక్టర్‌తో తప్పించి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి.

ఆర్టీసీ బస్సు తగిలి వృద్ధుడు మృతి

సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన తాటికొండ బిక్షం (70) సోమవారం ఆర్టీసీ బస్సు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమా లేక వృద్ధుడి బిక్షం తప్పా అనేది పక్కన పెడితే .. నిత్యం రద్దీగా ఉండే సెంటర్‌లో రహదారిపైకి బస్సుషెల్టర్‌ ఏర్పాటు చేయడం, బస్సులు రోడ్డుపైనే నిలపడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ ఎలాంటి ముందుచూపు లేకుండా బస్సు షెల్టర్‌ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధుడు బిక్షం మృతితో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధుడు మృతి కారణంగా ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వృద్ధుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలు వురు కోరుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ప్రమాదాలు పునరావృతం కాకుండా బస్సు షెల్టర్‌ను పూర్తిగా వెనకవైపుకు తొలగింప చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement