మొక్కల సంరక్షణలో డాక్టర్‌ నరేంద్రరెడ్డి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణలో డాక్టర్‌ నరేంద్రరెడ్డి ఆదర్శం

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

గుంటూరు మెడికల్‌: నగరంలో ఎనిమిదేళ్లుగా పది వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్న డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు కోరారు. ఆదివారం స్థానిక రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయ హాలులో చేయూత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పౌర సంస్థలు డాక్టర్‌ నరేంద్ర రెడ్డిని పర్యావరణ మిత్ర పురస్కారంతో సత్కరించాయి. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని హరిత వనంగా మార్చడానికి దృఢమైన సంకల్పంతో కృషి చేస్తున్న డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేయాలని ఆకాంక్షించారు. యూరప్‌ లో అనేక దేశాల్లో పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తూ గ్రీన్‌ పార్టీలు ఏర్పడుతున్నాయని, భారత దేశంలో పచ్చదనం పెంపుదలకు ఎంతో కృషి జరగాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి శ్యామల నగర్‌లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ లో దాదాపు 15 కిలోమీటర్ల మేర మొక్కలు నాటి సంరక్షించడం గొప్ప విషయమన్నారు. ఎల్‌ నినో నేపథ్యంలో అడవులను రక్షించుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం అత్యంత ప్రాధాన్యత అంశంగా మారిందన్నారు. చేయూత ఫౌండేషన్‌ కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి వైద్య వృత్తిలో ఎవర్‌ గ్రీన్‌ ఎర్త్‌ ఫౌండేషన్‌ స్థాపించి దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చు చేసి మొక్కల సంరక్షణకు కృషి చేయడం హర్షణీయమని చెప్పారు. డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా అనేక అంశలపై పనిచేస్తున్నట్లు చెప్పారు. చేయూత ఫౌండేషన్‌ ద్వారా పర్యావరణ మిత్ర పురస్కారాన్ని అందుకోవడం తన బాధ్యతను నాలుగు రెట్లు పెంచిందని పేర్కొన్నారు. సౌత్‌ కొస్టల్‌ రైల్వేస్‌ మజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ సెక్రటరీ ఎస్‌.మంజునాథ్‌, నేస్తం వ్యవస్థాపకుడు జలీల్‌ అహ్మద్‌, మానవత నేతలు వజ్రాల వెంకట నాగిరెడ్డి, పోలూరి వీరారెడ్డి, కె.సతీష్‌, జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి తమ్మా ధనుంజయ రెడ్డి, కోవిడ్‌ ఫైటర్స్‌ నేత బషీర్‌ అహ్మద్‌, తెలుగు భాషోద్యమ నేత పి.సింగారావు, రేట్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరెడ్డి, శ్యామల నగర్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.రాఘవరావు, సీనియర్‌ సిటిజన్‌న్స్‌ అసోసియేషన్‌ నేత వల్లూరి సదాశివరావు, గుంటూరు గ్రీన్‌ కోర్‌ బాధ్యులు డి. తిరుపతి రెడ్డి, కొండవీడు కోట అభివద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి, సేవా తత్పరులు బండి అశోక్‌ రెడ్డి, బి.ఎం.ఆర్‌. ఫౌండేషన్‌ చైర్మన్‌ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

డాక్టర్‌ బూసిరెడ్డికి పర్యావరణ

మిత్ర పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement