ఆర్య సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఆర్య సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి గుర్తింపు

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

తెనాలి: ఆర్య సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వ్యక్తులను గౌరవించేలా ఆర్య పురుష, ఆర్య మాత బిరుదులతో కూచిపూడి ఆర్య సమాజ మందిరం సత్కరించడం ముదాహమని వక్తలు ప్రశంసించారు. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని ఆర్య సమాజ మందిరంలో ఆదివారం పండిత గోపదేవ్‌ వైదిక ధర్మ ప్రచార సమితి ఆర్య ప్రతినిధి సభా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైదిక ధర్మ ప్రచారకులు డాక్టర్‌ కొసరాజు రవీంద్రనాథ్‌ అధ్యక్షత వహించారు. పలువురు వక్తలు మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ సిద్ధాంతాల గురించి ప్రసంగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సిద్ధాంతాలను ప్రచారం గావించిన మహనీయులు గోపదేవ్‌ శాస్త్రి అని గుర్తుచేశారు. అనంతరం ‘ఆర్య పురుష’ బిరుదును తెనాలి చెందిన వైదిక ధర్మ ప్రచారకులు గుగ్గిలం రామ్మోహన్‌రావుకు, ‘ఆర్య మాత’ బిరుదును కూచిపూడి కి చెందిన వైదిక ధర్మ ప్రచారకులు కావూరి లక్ష్మీరాజ్యంకు నిర్వాహకులు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో మాఘం కృష్ణమూర్తి ,గల్లా కోటయ్య, గుర్రం నిర్మలాదేవి, కూరపాటి కళ్యాణి, కనగాల రవికుమార్‌, డాక్టర్‌ నల్లూరి సురేష్‌, పద్మావతిదేవి, నాగభైరవ గంగాపార్వతి, ఏలూరు సూర్యనారాయణ, ఆర్య సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement