ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

నెహ్రూనగర్‌: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్‌ పాలన, ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుమారు 50 వేల నుంచి 60 వేల మంది ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ పాలనలో, ప్రజాప్రతినిధుల ఎంపికలో వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేరకు అరండల్‌ పేటలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చార్వాక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నిం డేవిడ్‌ విలియమ్స్‌, భీమ్‌ సేన సేవాదల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిముక్కల సురేష్‌, దళిత నాయకుడు డాక్టర్‌ యంద్రపాటి సాంబశివరావు, లోక్‌ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిద ప్రకాష్‌, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అనీల్‌, భారత సమాజ పార్టీ అధ్యక్షుడు మంచాల జోషప్‌, మహిళా నేత రావినూతల కమల కుమారి, తాటిగిరి జయరత్నం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement