అధికార పార్టీ నిబంధనలు లెక్కచేయడం లేదు.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో గుంటూరు నగరంలో ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఇప్పటికీ ప్రధాన కూడళ్లలో దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ లోగో, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫొటోలు యథాతథంగా కొనసాగుతున్నాయి. నగరంలోని మందుల షాపులపై సైతం చంద్రబాబు ఫొటోలతో కూడిన స్టిక్కర్లు, ప్రభుత్వ పథకాల ప్రచార ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. ఉలంఘనలపై ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు


