తెనాలి చైర్మన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మద్దాళి శేషాచలం | - | Sakshi
Sakshi News home page

తెనాలి చైర్మన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మద్దాళి శేషాచలం

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

తెనాలి చైర్మన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మద్దాళి శేషాచలం నైపుణ్యాల పెంపుపై ఏఎన్‌ఎంలకు శిక్షణ గుంటూరు మెడికల్‌: జిల్లాలో అధిక ప్రమాదకర గర్భధారణల గుర్తింపు, నిర్వహణకు సంబంధించిన ప్రోటోకాల్స్‌పై ఏఎన్‌ఎంలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. మూడవ బ్యాచ్‌కు ఈ నెల 14, 15 తేదీలలో శిక్షణ అందించారు. గర్భిణుల్లో అధిక ప్రమాద పరిస్థితులను ముందుగానే గుర్తించడం, అవసరమైన ప్రాథమిక వైద్య నిర్వహణ చేపట్టడం, సరైన సమయంలో ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్‌ చేయడం, తల్లి, శిశు ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. నైపుణ్యాలను పెంపొందించడం శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.పద్మావతి తెలిపారు. అధిక ప్రమాద గర్భధారణలను సకాలంలో గుర్తించి, గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ఇటువంటి శిక్షణలు దోహదపడతాయని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో డాక్టర్‌ ఎ.శ్రీవల్లి, డాక్టర్‌ కె.ప్రియాంక, డాక్టర్‌ ఎం.శ్రీధర్‌, డాక్టర్‌ బి.ఎస్‌.కె. భార్గవ్‌, డాక్టర్‌ వి.సుబ్బారావు, ఆరోగ్య విద్యా విస్తరణాధికారి ఓ. రవికుమార్‌, అర్మన్‌ సంస్థ ప్రతినిధులు, డాక్టర్‌ చరణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్‌క్వాస్‌ సేవల్లో ద్వితీయ స్థానంలో గుంటూరు గుర్తు తెలియని మహిళ హత్య

తెనాలి: మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన మద్దాళి శేషాచలం ఎంపికయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఎంపికై న అభ్యర్థుల జాబితాను గురువారం రాత్రి విడుదల చేశారు. ఓసీ జనరల్‌కు కేటాయించిన తెనాలి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మద్దాళి శేషాచలంను నియమించారు. కూటమి పార్టీల్లో చైర్‌పర్సన్‌ పదవిని ఏ పార్టీకి కేటాయించాలనే అంశంపై ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థిని ప్రకటించి దూకుడును ప్రదర్శించింది. ఆర్యవైశ్య వర్గానికి చెందిన శేషాచలం సౌమ్యులు, వివాదరహితుడిగా గుర్తింపు ఉంది. గత పదేళ్లుగా పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు పట్టణ క్లస్టర్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు పార్టీలోని సొంత సామాజికవర్గంతోపాటు, అన్ని వర్గాలతోనూ స్నేహపూర్వక సంబంధాలున్నాయి. గత పాతికేళ్లుగా ఆయన ఆయిల్‌ వ్యాపారంలో కొనసాగుతున్నారు. కష్టపడి పార్టీలో పనిచేస్తున్న తనను గుర్తించి, చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, తన పేరును ప్రతిపాదించిన తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు శేషాచలం ధన్యవాదాలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా కష్టపడి పనిచేసి, ఎన్నికల్లో తనతోపాటు, పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థుల విజయానికి త్రికరణశుద్ధితో పనిచేస్తానని చెప్పారు.

గుంటూరు మెడికల్‌: ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు అందించే వైద్య సేవల్లో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వితీయ స్థానంలో నిలిచింది. నేషనల్‌ క్వాలిటీ ఎస్సూరెన్స్‌ స్కీమ్‌ (ఎన్‌ క్వాస్‌) గురువారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి నివేదికలో తొలిస్థానం ఈస్ట్‌ గోదావరి జిల్లా దక్కించుకోగా, గుంటూరు ద్వితీయ స్థానం, వైఎస్సార్‌ కపడ జిల్లా తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వచ్చే రోగులు ఓపీ చీటి తీసుకున్న దగ్గర్నుంచి, మందులు, ల్యాబ్‌ పరీక్షలు, లోపల ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వసతులు, రోగికి అందించే వైద్య సేవలు, ఆసుపత్రిలో వాతావరణం తదితర అంశాలపై ఎన్‌క్వాస్‌ సర్వేను అన్ని జిల్లాల్లో నిర్వహించారు. ఎన్‌క్వాస్‌ వసతుల సౌకర్యాల్లో ఈస్ట్‌ గోదావరి జిల్లా 38.70 శాతం వసతులు కల్పించి ప్రథమ స్థానం దక్కించుకుంది. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 37.10 శాతం వసతులు కల్పించి ద్వితీయ స్థానంలో నిలిచింది.

గుంటూరు రూరల్‌: గుర్తు తెలియని మహిళను హత్య చేసి గుర్తు పట్టకుండా తగల బెట్టిన సంఘటన నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగు చూసింది. సీఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌హెచ్‌–16లో బుడంపాడు పరిధిలోని హిందుస్థాన్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో అన్నపూర్ణ సొసైటీ కాంప్లెక్స్‌ పక్కన ఉన్న గ్రావెల్‌ రోడ్డు (మట్టి రోడ్డు) పక్కన ఒక మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. బుడంపాడు వీఆర్‌వో మెరుగుమాల కోటేశ్వరరావు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్‌ఐ సురేష్‌ పూర్తిగా కాలిపోయిన దశలో ఉన్న మహిళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మహిళను ఎక్కడో హత్య చేసి, గుర్తింపు దొరకకుండా ఉండేందుకు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు దుండగులు ఈ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా దర్యాప్తు

నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement