మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్‌ జారీ | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్‌ జారీ

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

నెహ్రూనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం, ఎకై ్సజ్‌ శాఖ మార్గదర్శకాల ప్రకారం 2026–27 సంవత్సరానికి గాను గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రెన్యువల్‌ కాకుండా మిగిలిపోయిన ఓపెన్‌ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు జిల్లాల్లో రిజర్వ్‌ కేటగిరీకి చెందిన మొత్తం 26 మద్యం దుకాణాలు నూటికి నూరు శాతం రెన్యువల్‌ అయినట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీలకు సంబంధించి మొత్తం 138 మద్యం షాపులను నోటిఫై చేయగా, వాటిలో 91 షాపులు రెన్యూవల్‌ అయ్యాయని తెలిపారు. రెన్యూవల్‌ కాని 47 షాపులతో పాటు గతంలో ఫంక్షన్‌లో లేని మరో 2 షాపులు కలిపి మొత్తం 49 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించేందుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అలాగే పల్నాడు జిల్లాలో నోటిఫై చేసిన 142 షాపుల్లో 118 మద్యం దుకాణాలు రెన్యూవల్‌ కాగా, మిగిలిన 24 షాపులకు లాటరీ పద్ధతిన కేటాయింపు చేపట్టనున్నామని వివరించారు. గుంటూరు డివిజన్‌ పరిధిలోని రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 73 దుకాణాలకు లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సంబంధించి ఒక్కో దరఖాస్తుకు రూ.3,00,000 ఫీజుగా నిర్ణయించారు. ప్రతి దుకాణానికి కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్‌ 5వ తేదీన సంబంధిత జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి దుకాణాలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారిణి (డీపీఈవో) వి.అరుణ కుమారి, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఇ.మారయ్యబాబు పాల్గొన్నారు.

వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్‌ డీసీ డాక్టర్‌ కె.శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement