కనుమూరి హాస్పిటల్‌లో 100 రోబోటిక్‌ సర్జరీలు | - | Sakshi
Sakshi News home page

కనుమూరి హాస్పిటల్‌లో 100 రోబోటిక్‌ సర్జరీలు

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

కనుమూరి హాస్పిటల్‌లో 100 రోబోటిక్‌ సర్జరీలు

గుంటూరు మెడికల్‌: ఆధునిక మోకాలి మార్పిడి వైద్యంలో మరో ముఖ్యమైన మైలురాయిని కనుమూరి హాస్పిటల్స్‌ సాధించింది. గుంటూరులో తొలిసారిగా వైలెస్‌ రోబోటిక్‌–అసిస్టెడ్‌ సర్జరీ సిస్టం అందుబాటులోకి తీసుకువచ్చిన కనుమూరి హాస్పిటల్లో ఇప్పటివరకు 100 రోబోటిక్‌ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్య వర్గాలు గురువారం వెల్లడించారు. రోబోటిక్‌ సాంకేతికతను గుంటూరులో అందుబాటులోకి తీసుకువచ్చిన కొద్ది కాలంలోనే 100 శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకోవడం విశేషమని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన వైద్య బృందం, శిక్షణ పొందిన సిబ్బంది సమన్వయంతో రోగులకు నాణ్యమైన జాయింట్‌ రీప్లేస్మెంట్‌ సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కనుమూరి హాస్పిటల్స్‌ జాయింట్‌ రీప్లేస్మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ గిరిధర్‌ బోయపాటి మాట్లాడుతూ ఈ 100 కేసుల మైలురాయి తమ ఒక్కరి విజయం కాదన్నారు. తమపై నమ్మకం ఉంచి చికిత్స కోసం మా వద్దకు వచ్చిన ప్రతి రోగికి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, ప్రతి రోగికి అవసరానికి తగిన అత్యుత్తమ చికిత్స అందించడమే తమ లక్ష్యం తెలిపారు. 100 రోబోటిక్‌ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని సాధించిన సందర్భంగా కనుమూరి హాస్పిటల్స్‌ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, టెక్నికల్‌ టీమ్‌, ఇతర సిబ్బంది సమిష్టి కృషిని ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది. రోగులు, వారి కుటుంబ సభ్యుల నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement