గుంటూరు మెడికల్: పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో డాక్టర్ కుందూరు నేహారెడ్డికి ఆల్ ఇండియా 35వ ర్యాంకు లభించింది. డాక్టర్ నేహారెడ్డి మంగళగిరి ఏయిమ్స్‌లో ఎంబీబీఎస్ 2026 ఏప్రిల్‌లో పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్ పై తనకు ఆసక్తి ఉందని, పీజీ మెడిసిన్ పూర్తి చేసి పేద రోగులకు సేవలందిస్తానని డాక్టర్ నేహారెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో 35వ ర్యాంకు సాధించిన డాక్టర్ నేహారెడ్డికి ఆమె తల్లిదండ్రులు కె.వి.రెడ్డి, నవీనలకు గురువారం పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.


