ఎటు చూసినా ముసురు గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో వర్షాలు పడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అడపాదడపా కురిసిన వర్షాలతో బోర్లు, బావుల కింద పరిమిత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ముసురుతో కూడిన తేలికపాటి వర్షం పడుతోంది. పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.
ఎల్‌నినో పరిస్థితులున్నా..
జిల్లాలో ఇప్పటి వరకు 79,296 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేపట్టారు. ఇందులో వరి – 53,480, పత్తి – 18,601, మిరప – 1,930, మినుము – 1,490, పసుపు – 960, పండ్ల తోటలు – 958, కూరగాయలు – 863, పూలు 401 హెక్టార్లలో సాగు చేశారు. పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఒక్కసారి తడి పెట్టడానికి ఎకరాకు రూ.వెయ్యికిపైగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. వర్షాలు కురవకపోవడం, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో వరి, పత్తి మినుము, కూరగాయల పంటలు ఎండుముఖం పట్టాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 535.90 మి.మీ. పడాల్సి ఉన్నా... 399.40 మి.మీ. మాత్రమే నమోదైంది. 25 శాతం లోటు ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. సెప్టెంబర్ 23వ తేదీ వరకు 111.30 మి.మీ. వర్షపాతం పడాల్సి ఉండగా, 138.80 మి.మీ. వర్షపాతం నమోదైంది. కీలకమైన జూలై మాసంలో 59 శాతం, ఆగస్టు నెలలో 48 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు.
16 మండలాల్లో తేలికపాటి వర్షం..
జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 16 మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు... తాడేపల్లి మండలంలో 11.6, మంగళగిరి 7, పెదనందిపాడు 4.6, కొల్లిపర 4.2, పెదకాకాని 2.4, దుగ్గిరాల 2.4, తెనాలి 2.4, తుళ్ళూరు 2.2, తాడికొండ 2.2, ప్రత్తిపాడు 2.2, చేబ్రోలు 2, మేడికొండూరు 1.6, ఫిరంగిపురం 1.2, గుంటూరు పశ్చిమ 1.2, వట్టిచెరుకూరు 1.2, గుంటూరు తూర్పులో 0.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
నిమ్మకాయల ధరలు
సాగర్ నీటిమట్టం
గుంటూరు
● జిల్లా వ్యాప్తంగా మోస్తరు వానలు
● నేడూ భారీ వర్షం పడే అవకాశం
ఉందని అధికారుల ప్రకటన
7
మంగళగిరిలో రోడ్డుపైకి చేరిన వాననీరు
వానలోనే మొక్కజొన్న కంకులు విక్రయిస్తున్న దృశ్యం
మంగళగిరిలో కురుస్తున్న వర్షం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.3726 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర రూ.11,500, మోడల్ ధర రూ.9,600 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 535.80 అడుగులకు చేరింది. ఇది 179.6902 టీఎంసీలకు సమానం.