గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ముఖ్యమైన కార్యక్రమానికి కొందరు అధికారులు గైర్హాజరవుతున్నట్లు గుర్తించామన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దూరప్రాంతాల నుంచి అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన అర్జీలను కలెక్టర్‌తోపాటు జిల్లా పరిషత్ సీఈఓ వి.జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా మైనారిటీ అధికారి జె.పార్థసారథి పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ


