చెలమలు తవ్వుకుని పంటలు కాపాడుకునే యత్నం
యనమదల సమీపంలో పొలాల్లో తవ్విన నీటి చెలమ
ఎల్‌నినో పంజా విసరడం, వానలు జాడలేకపోవడం, సర్కారు కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేయకపోవడంతో కర్షకులకు నీటి పాట్లు తప్పడం లేదు. సాగు చేసిన పంటను బతికించుకునేందుకు రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. ప్రత్తిపాడు మండలం యనమదల పరిసర ప్రాంతాల్లో రైతులు పత్తి, మిర్చి పంటలను సాగు చేశారు. నీరు లేక వడబడి ఎండిపోతున్న మొక్కలను కాపాడుకునేందుకు పొలాల్లో నీటి చెలమలు తవ్వుకుని వచ్చిన కొద్ది నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా మొక్కమొక్కకు ప్రాణం పోసేందుకు
విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. – ప్రత్తిపాడు


