80 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రదానోత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 80 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఇద్దరు హెచ్‌ఎంలు, స్కూల్ అసెస్టెంట్ కేటగిరీలో 32 మంది, ఎస్జీటీలు 44 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారందరూ శనివారం ఉదయం 8.00 గంటలకు హాజరు కావాలని సూచించారు.
కొనసాగుతున్న
సీనియర్ వైద్యుల నిరసన
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్‌ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ టి.స్వరూప్‌కాంత్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్ అధ్యక్షుడు డాక్టర్ బి.దేవకుమార్, యూనియన్ నేతలు రాజాకుమార్, శివరామ్, ఉషారాణి, కమల, సునీత, శ్రీదేవి, వినయ్, రవీంద్ర, శివగోపాల్, గాజుల రామకృష్ణ, టి.వి.శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


