సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

తాడికొండ: సీఎం పర్యటన ఏర్పాట్లను హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, ఎస్పీ వకుల్‌ జిందాల్‌లు శుక్రవారం పరిశీలించారు. రూ.40 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు సమకూర్చిన 58 ఆధునిక ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో చేపట్టిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నియంత్రణ, వీఐపీ మార్గాలు, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీలు, చెకింగ్‌ పాయింట్లను ఎస్పీ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్న వాహనాల్లో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు, 20 వాటర్‌ బౌజర్లు, 13 క్విక్‌ రెస్పాన్‌న్స్‌ మల్టీపర్పస్‌ వాహనాలు ఉన్నాయి. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అదనపు ఎస్పీ లా అండ్‌ ఆర్డర్‌ ఏటీ రవికుమార్‌, ఎస్‌బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్‌, నార్త్‌ డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్‌ సీఐ కోటేశ్వరరావు, పోలీస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకల భద్రత ఏర్పాట్లు పరిశీలన

తాడికొండ: రాజధానిలో శనివారం నిర్వహించనున్న 80వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో అమరావతి పెరేడ్‌ గ్రౌండ్స్‌లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పెరేడ్‌ నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శుక్రవారం పరిశీలించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ఎస్పీ సమగ్ర ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీసీఎస్‌ ఎస్పీ సుప్రజ, అదనపు ఎస్పీ లా అండ్‌ ఆర్డర్‌ రవికుమార్‌, అదనపు ఎస్పీ అడ్మిన్‌ రమణమూర్తి, ఎస్బీ డీస్పీ అళహరి శ్రీనివాస్‌, ఏఆర్‌ డీఎస్పీ సుంకరయ్య, పోలీస్‌ అధికారులు పోలీస్‌ సిబ్బంది హాజరయ్యారు.

ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి,

కలెక్టర్‌, ఎస్పీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement