ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డైరెక్టర్, వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. సౌత్ కొరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వరల్డ్ సొసైటీ ఫర్ పీస్ స్పోర్ట్స్ ఇండియన్ కోఆర్డినేటర్‌గా పాల్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు సంస్థ కార్యనిర్వాహకుల నుంచి నియామక ఉత్తర్వులు ఏఎన్‌యూకు అందాయి. పాల్‌కుమార్‌ను వర్సిటీ వీసీ కె.గంగాధరరావు, రెక్టార్ ఆర్.శివరాం ప్రసాద్, పలు వురు కోఆర్డినేటర్లు అభినందనలు తెలిపారు.


