ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విశ్వవిద్యాలయ అభివృద్ధికి విశేషంగా సేవలందించిన దాతలు, ప్రముఖులు, విద్యావేత్తలను ఘనంగా సత్కరించనున్నట్లు విశ్వ విద్యాలయ ఉన్నతాధికారులు రెక్టార్ ఆచార్య రామి నేని శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం తెలిపారు. స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం డాక్టర్ డైక్‌మన్ ఆడిటోరియంలో నిర్వ హించనున్న దాతల సత్కార కార్యక్రమం వివరాల ను వెల్లడించారు. 1976లో స్థాపించబడిన విశ్వవిద్యాలయం 2026లో 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏడాది పొడవునా స్వర్ణోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
విశిష్ట దాతలకు సత్కారం..
విశ్వవిద్యాలయానికి వివిధ రూపాల్లో సేవలందించిన దాతల సత్కార కార్యక్రమానికి వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే గంగాధర్‌రావు అధ్యక్షత వహించనున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ మొహంతి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి హాజరు కానున్నారు. అలానే డాక్టర్ బయ్యపు శ్రీకృష్ణమూర్తి, జాగర్లమూడి మురళీమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అయ్యంగార్, దాతలు తులసి రామచంద్రప్రభు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పాలడుగు లక్ష్మణరావు, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ముద్దులేని శ్రీనివాస్, డాక్టర్ వైవీ ఆంజనేయులు, శివరామకృష్ణ ప్రసాద్, ఎం.కమలాకర్ బాబు, కర్రి గోపాలకృష్ణ, హేమంత్‌రెడ్డి, ఎన్.భారతి, షేక్ షమీమ్ భాను, రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేషి బాబు తదితర ప్రముఖులను కూడా సత్కరించనున్నారు.


