గుంటూరు మెడికల్: గ్రీన్ గుంటూరులో భాగంగా ఆటోనగర్ ఏపీఐఐసీ ప్రాంగణంలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కాలు ష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రీన్ గుంటూరు కార్యక్రమం ఉన్నతమైన కార్యక్రమం అన్నారు. ఆహ్లాదకర వాతావరణం కల్పించటమే కాకుండా వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం కూడా ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల మొక్కలను నాటి సెల్ఫీ తీసి పంపించాలని కోరడం జరిగిందన్నారు. గుంటూరు నగరాన్ని హరిత నగరంగా, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుటకు తీసుకున్న సంకల్పంలో భాగస్వామ్య మై పచ్చదనాన్ని నింపాలని నజీనా బేగం కోరారు.
మేడికొండూరు: తాగునీటికి బదులు ఇంట్లో ఉన్న టిన్నర్ తాగడంతో చిన్నారి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పేరేచర్లలోని 6వ మైలు కాలనీకి చెందిన ఆశాది రాజేష్, లక్ష్మి దంపతుల రెండో కుమార్తె అన్విత(3). సా యంత్రం దాహంగా ఉండగా ఇంట్లో ఉన్న టిన్నర్‌ను పొరపాటున తాగింది. విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలికను పేరేచర్లలోని స్థానిక ఆర్‌ఎంపీ క్లినిక్‌కు తరలించారు. అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి రాజేష్ పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తుండగా, తల్లి రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం


