– జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు చేసే కంపెనీల వాహనాలు అతివేగంతో తిరుగుతున్నాయని, వాటికి కచ్చితంగా స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పరిధిలోని నేషనల్ హైవేపై విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్ల దగ్గర స్పీడ్ బ్రేకర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నాణ్యతగా మధ్యాహ్న భోజనం
గుంటూరు వెస్ట్: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా, నాణ్యతగా సరఫరా చేసేందుకు స్మార్ట్ కిచెన్ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిపై ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


