ఉద్యమ యోధుడు ముద్రగడ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ యోధుడు ముద్రగడ

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : కాపుల్లో చైతన్యం తీసుకొచ్చిన ఉద్యమనేత, అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం అని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు ఉద్ఘాటించారు. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు మార్కెట్‌ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సభకు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మాధా రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు.

● నంబర్‌ వన్‌ చానల్‌ అధినేత సాయి సుధాకర్‌ ,రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మలిశెట్టి సుబ్బారావు, మిరియాల శ్రీనివాసరావు, చందు జనార్దన్‌, అమ్మ శ్రీనివాస్‌నాయుడు, జనసేన నుంచి చందు సాంబశివరావు, గాదె వెంకటేశ్వరరావు, పాకలపాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, టీడీపీ నుంచి ఆజా రామకృష్ణ, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్‌, మార్కండేయులు (బీజేపీ), మాజీ మేయర్‌ కావటి మనోహర్‌, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ నుంచి నాయకులు పాల్గొన్నారు.

ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కాపు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు

ముద్రగడ సంతాప సభకు హాజరైన పలు పార్టీల కార్యకర్తలు అభిమానులు, కాపు వర్గీయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement